ఆ టీమ్​ఇండియా క్రికెటర్ కు భయం తెలియదు: జాస్​ బట్లర్

Shower of praise on Team India cricketer Pant

0
111

టీమ్​ఇండియా క్రికెటర్​ రిషభ్ ​పంత్​ను ప్రశంసలతో ముంచెత్తాడు ఇంగ్లాండ్​ ప్లేయర్​ జాస్​ బట్లర్​. పంత్​ ఆటతీరు అద్భుతంగా ఉంటుందని, దాన్ని తాను బాగా ఆస్వాదిస్తాడని చెప్పాడు. అతడు భయం ఎరుగని క్రికెటర్​ అని కితాబిచ్చాడు.

వచ్చే నెల 8వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న యాషెస్​ సిరీస్​లో పంత్​ తరహా భయం లేకుండా ఆడటానికి ప్రయత్నిస్తాడని అన్నాడు. ఆస్ట్రేలియాపై టీమ్​ఇండియా టెస్ట్​ సిరీస్​ గెలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు బట్లర్​.

ఆస్ట్రేలియాలో పంత్​ ఆటతీరును బాగా ఆస్వాదించా. పరిస్థితికి తగ్గట్టు అటు దూకుడుని ఇటు డిఫెన్స్​ను సమన్వయం చేసుకుంటూ అతడు ఆడేతీరు నాకు బాగా ఇష్టం. అతడికి భయమంటే తెలియదు. నేను కూడా అతడి తరహాలో భయం లేకుండా ఆడటానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు.