బిగ్ బాస్ నుండి వెళ్ళిపోయినా శ్యామల

బిగ్ బాస్ నుండి వెళ్ళిపోయినా శ్యామల

0
117

బిగ్ బాస్ సీజ‌న్ 2లో మ‌రో వివాదం. వారానికొక‌రు ఎలిమినేట్ అయ్యే ఈ షోలో.. ఇవాళ్టి కార్య‌క్ర‌మం ప్ర‌సారం కాక‌ముందే ఎవ‌రు ఎలిమినేట్ అయ్యారో తెలిసిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌యింది. షో తొలివారంలో సంజ‌న‌, రెండో వారంలో నూత‌న్ నాయుడు, మూడో వారంలో కిరీటి దామ‌రాజు ఎలిమినేట్ కాగా, నాలుగో వారంలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో అస‌లైతే ఈ సాయంత్రం తెలియాల్సిఉండ‌గా…యాంక‌ర్ శ్యామ‌ల ఎలిమినేట్ అయిన‌ట్టు ఇప్ప‌టికే అంద‌రికీ తెలిసిపోయింది.

ఈ విష‌యాన్ని శ్యామ‌లే స్వ‌యంగా తెలియ‌జేయ‌డం వివాదంగా మారింది. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన శ్యామ‌ల త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌ల‌ని, తాను హౌస్ ను వీడి ఇంటికి వ‌చ్చాన‌ని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం త‌న కొడుకు ఇషాన్ తో ఆడుకుంటున్నాన‌ని తెలిపింది. ఈ పోస్ట్ వైర‌ల్ గా మార‌డంతో బిగ్ బాస్ యాజ‌మాన్యం, స్టార్ మా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాయి. దీంతో వెంట‌నే శ్యామ‌ల త‌న పోస్ట్ ను డిలీట్ చేసిన‌ప్ప‌టికీ జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. శ్యామ‌ల ఎలిమినేట్ అయిపోయింద‌ని తేల‌డంతో ప్రేక్ష‌కుల‌కు ఇవాళ్టి షో పై ఇంట్ర‌స్ట్ పోయింది.