పింక్ బాల్ టెస్టు: స్మృతి మంధాన నయా రికార్డు

Smriti Mandhana New Record

0
86

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక పింక్‌బాల్ టెస్టులో భారత ఓపెనర్ స్మృతి మంధాన చూడచక్కని షాట్లతో అలరిస్తోంది. ఈ క్రమంలో ఆమె అరుదైన ఘనత సాధించింది. పింక్‌బాల్ టెస్టులో తొలి సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.

అంతేకాదు తాను ఆడిన తొలి డే-నైట్ టెస్టులో సెంచరీ చేసిన రెండో భారతీయురాలిగా కూడా నిలిచింది. గతంలో బంగ్లాదేశ్‌పై టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు.  అసలు ఆమె తొలి రోజే సెంచరీ చేయాల్సింది. కానీ వర్షం అంతరాయం కలిగించడంతో తొలిరోజు కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాగింది.

దీంతో ఆమె సెంచరీ రెండో రోజుకు వాయిదా పడింది. అయితే రెండో రోజు ఆటలో ఆమె అవుటయ్యే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. రెండో రోజు రెండో ఓవర్లో పెర్రీ బంతికి క్యాచ్ అవుటైంది. కానీ ఆ బంతి నోబాల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకుంది. 171 బంతుల్లో ఆమె మూడంకెల స్కోర్ అందుకుంది.