విజయానికి చేరువలో దక్షిణాఫ్రికా..ఇండియా గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే!

-

జోహన్నెస్​బర్గ్​ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇండియాపై ఆధిపత్యం చెలాయిస్తోంది దక్షిణాఫ్రికా. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్​లో రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.

- Advertisement -

మరో 122 పరుగులు సాధిస్తే దక్షిణాఫ్రికాకు విజయం సొంతం కానుంది. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్(46), వాన్ డర్ డసెన్(11) ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలిఉన్న నేపథ్యంలో ఫలితం తేలడం ఖాయం. టీమ్​ఇండియా బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్​ తలో వికెట్ పడగొట్టారు.

రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా బ్యాటర్లు తడబడ్డారు. దీంతో 266 పరుగులకే పరిమితమైంది భారత్. రహానే (58), పుజారా (53) అర్ధశతకాలతో రాణించారు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి మద్దతు లభించలేదు. చివర్లో విహారి (40*) పోరాడటం వల్ల రెండో ఇన్నింగ్స్​లో 266 పరుగులకు పరిమితమైన భారత జట్టు.. సఫారీల ముందు 240 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జోహన్నెస్​బర్గ్​లో ఇప్పటివరకు 220కి పైగా పరుగుల్ని ఎప్పుడూ ఛేదించలేదు సౌతాఫ్రికా. 2006లో చివరిసారిగా న్యూజిలాండ్​పై 220 పరుగుల్ని ఛేదించి విజయం సాధించింది సఫారీ జట్టు. ఈసారి దాన్ని అధిగమిస్తుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...