దేశవాళీ క్రికెట్లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం రేపింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్ త్వరలో జరగనున్న నేపథ్యంలో క్రికెటర్ సతీష్ రాజగోపాల్‌ను ఫిక్సింగ్‌కు పాల్పడాలంటూ ఓ వ్యక్తి డబ్బు ఆఫర్ చేసినట్లు తెలిసింది.
“జనవరి 3న బన్నీ ఆనంద్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి సతీష్ రాజగోపాల్‌కు కొంత డబ్బు ఆఫర్ చేశాడు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని కోరాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ నేపథ్యంలో ఇద్దరు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారని రాజగోపాల్‌కు చెప్పాడు. ఒక్కో మ్యాచ్‌కు రూ. 40 లక్షలు ఇస్తామని సతీష్‌కు ఆఫర్ ప్రకటించాడు” అని లోకేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, ఈ ఆఫర్‌ను తిరస్కరించిన సతీష్ కూడా.. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదు చేశాడు.