నటి శ్రీరెడ్డి తాజాగా ” రెడ్డి డైరీ ” పేరుతో బాంబ్ పేల్చింది . తెలుగు , తమిళ చిత్ర రంగాల్లోని వాళ్ళని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి కి తెలుగులో సినిమాలు లేకపోయేసరికి చెన్నై బాట పట్టింది , అక్కడ ఈ భామ గాధ విన్న ఓ దర్శకుడు ” రెడ్డి డైరీ ” పేరుతో శ్రీరెడ్డి కి ఎదురైన అనుభవాలతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు . ఆ సినిమా వస్తే నిజంగా సంచలనమే అవుతుంది ఎందుకంటే సినిమారంగంలోని పలువురు ప్రముఖులను టార్గెట్ చేసింది శ్రీరెడ్డి . హీరోలతో పాటుగా దర్శక నిర్మాతలపై ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి .
ఇక రెడ్డి డైరీ సినిమాని పక్కన పెడితే మరో బాంబ్ పేల్చింది శ్రీరెడ్డి . నా దగ్గర పలువురి వీడియోలు ఉన్నాయని వాటిని త్వరలోనే బయటపెడతానని బాంబ్ పేల్చింది చెన్నై లో . గతకొంతకాలంగా చెన్నై లో ఉంటున్న ఈ భామ తెలుగు సినిమా మీద ఆశలు వదులుకుంది . నిన్న శ్రీరెడ్డి వీడియోలు లీక్ చేస్తానని ప్రకటించడంతో పలువురు సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి . ఎవరి వీడీయో రిలీజ్ చేస్తుందో ? అని బిక్కచచ్చిపోతున్నారు .