తమిళ హీరోకి నోటీసులు పంపిన శ్రీ రెడ్డి

తమిళ హీరోకి నోటీసులు పంపిన శ్రీ రెడ్డి

0
117

నటి శ్రీరెడ్డి కదిపిన క్యాస్టింగ్ కౌచ్ అనే తేనేతుట్ట చిలికి చిలికి గాలివానగా మారి పెద్ద దుమారమే లేపిందని చెప్పవచ్చు. ఈ దుమారం ఎటు వచ్చి ఎటు తిరిగి ఎటు పోతుందో తెలియక సామాన్యులు తికమక పడుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ అన్న పేరు చెబితేనే సినిమా రంగంలోని దర్శక, నిర్మాతలకు ముచ్చెమటలు పడుతున్నాయి, ఎప్పుడు ఎవరు ఎవరి పేరు బయటకు చెప్తారో.. ఏమవుతుందో అన్న విధంగా ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ మారింది. హీరోయిన్లకు సినిమాల్లో కొత్త అవకాశలు ఇవ్వడం కోసం కొందరు దర్శక నిర్మాతలు చేసిన పాడు పని మొత్తం సినిమా రంగాన్నే వివాదంలోకి నెట్టింది… కాగా నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లోని క్యాస్టింగ్ కౌచ్ పై గత కొన్ని రోజులుగా పోరాడుతున్న విషయం అందరికి తెలిసిందే ఇప్పటివరకు టాలీవుడ్ కె పరిమితమైందనుకున్న కాస్టింగ్ కౌచ్ వివాదంలోకి కోలీవుడ్ నటులను కూడా లాగింది…

ఇందులో భాగంగా కోలీవుడ్ రంగం ఇబ్బందుల్లో పడనుందని, అందుకోసం నడిగర్ సంఘం (తమిళ్) అధ్యక్షుడు, హీరో విశాల్ కు నోటీసులు ఇచ్చేందుకు అంతా సిద్ధమైందని వార్తలు వచ్చాయి.. అదే సమయంలో నటి శ్రీరెడ్డి నడిగర్ సంఘాన్ని కలవబోతున్నానని తన పేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ సంచలనాన్ని సృష్టిస్తుంది.. ఆ పోస్ట్ లో.. నేను త్వరలోనే నడిగర్ సంఘాన్ని కలవబోతున్నాను, పూర్తిగా మహిళల సమస్యలపైనే చర్చ జరగనుంది.. ఈ సమావేశానికి నాజర్ గారిని కూడా పిలిచాను.. ఏమైతుందో చూడాలి.. ఎవరైనా నేను కానీ వేరే మహిళలు కానీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న సమయంలో వ్యతిరేక నినాదాలు చేస్తే వారంతా ఈవ్ టీజింగ్, డొమెస్టిక్ వయొలెన్స్ సెక్షన్స్ అండర్ 1986.. 294, 509 ద్వారా శిక్షించబడతాయారని సూచించింది..