ఆ ఇద్దరు అన్నదమ్ములకు థాంక్స్ – శ్రీనివాసకల్యాణం టీం

ఆ ఇద్దరు అన్నదమ్ములకు థాంక్స్ - శ్రీనివాసకల్యాణం టీం

0
111

శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన మ‌ల్టీస్టార‌ర్‌ ‘సీత‌మ్మవాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు’ సినిమాలో పెద్దోడుగా విక్టరీ వెంక‌టేశ్‌, చిన్నోడుగా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయింది. అప్పటి నుంచి ఈ సంస్థతో హీరోలిద్దరికి ప్రత్యేక అనుబంధం కొన‌సాగుతుంది.

ఇదే అనుబంధంతో ఈ బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘శ్రీనివాస కళ్యాణం’కు త‌మ స‌పోర్ట్‌ను అందించారు. ఈ చిత్రం కోసం వెంక‌టేశ్ త‌న వాయిస్ ఓవ‌ర్‌ను ఇవ్వగా.. మ‌హేశ్ ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.ఈ అగ్ర క‌థానాయ‌కులిద్దరూ చేసిన స‌పోర్ట్‌కు ‘శ్రీనివాస క‌ళ్యాణం’ యూనిట్ వారికి కృత‌జ్ఞత‌లు తెలియ‌జేసింది. నితిన్‌, రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత తారాగ‌ణంగా స‌తీశ్ వేగేశ్న ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన ‘శ్రీనివాస క‌ళ్యాణం’ ఆగ‌స్ట్ 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది.