సురేష్ రైనా హర్భజన్ కు మొత్తానికి గుడ్ బై చెప్పిన సీఎస్కే

సురేష్ రైనా హర్భజన్ కు మొత్తానికి గుడ్ బై చెప్పిన సీఎస్కే

0
107

ఐపీఎల్ లో చెన్నై టీం తరపున సురేష్ రైనా హర్భజన్ ఆడుతారు అని అందరూ అనుకున్నారు.. కాని టీమ్ లో వారు ఇద్దరూ ఈసారి ఆటకి దూరంగా ఉన్నారు, అయితే తాజాగా చెన్నై ఫ్రాంచైజీతో సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ అనుబంధానికి శాశ్వతంగా తెరపడినట్టే కనిపిస్తోంది. ఇక చెన్నై జట్టులో వారు కనిపంచరు అని తెలుస్తోంది.

తమ అధికారిక వెబ్సైట్ నుంచి వారిద్దరి పేర్లను తొలగించిన ఆ ఫ్రాంచైజీ వారితో ఒప్పందాలనూ రద్దు చేసుకొనే ప్రక్రియను ఆరంభించిందట…2018 వేలం మార్గదర్శకాల ప్రకారం రైనా, భజ్జీతో చెన్నై మూడేళ్ల కాలానికి ఒప్పందాలు చేసుకుంది.

2020 ఈ ఏడాదితో అగ్రిమెంట్ పూర్తి అవుతుంది, కాని వారు వ్యక్తిగత కారణాలు చెప్పి ఈ ఏడాది లీగ్ కు దూరంగా ఉన్నారు.. ఏడాదికి రూ.11 కోట్లకు రైనా, రూ.2 కోట్లకు భజ్జీతో ఎన్.శ్రీనివాసన్ నేతృత్వంలోని ఫ్రాంచైజీ ఒప్పందాలు చేసుకుంది. అయితే ఇక లీగ్ లో ఆడలేదు కాబట్టి వారికి నగదు చెల్లించలేదు అని తెలుస్తోంది.

మ్యాచులు ఆడితేనే డబ్బులు ఇవ్వాలని ఆ ఫ్రాంచైజీ నిబంధన పెట్టుకున్నట్టు తెలిసింది. ఏదేమైనప్పటికీ నవంబర్ 10తో ఈ సీజన్ ముగుస్తుంది. మళ్లీ 2021, ఏప్రిల్లోనే 14వ సీజన్ ఆరంభం కానుంది. అప్పుడు ఎటువైపు ఉంటారో చూడాలి.