సైరా సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సైరా సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

0
112

ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత నేప‌థ్యంలో రూపొందుతున్న చిత్రం సైరా. చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ 30 శాతం వ‌రకు పూర్తైన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లో వేసిన స్పెష‌ల్ సెట్‌లో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది.

ఈ షెడ్యూల్ త‌ర్వాత యూర‌ప్‌కి వెళ్ల‌నుంది చిత్ర బృందం. అయితే మూవీ ఫ‌స్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తుండ‌గా, చిరు బ‌ర్త్ డే రోజు లుక్ విడుద‌ల అవుతుంద‌ని అభిమానులు భావించారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ని ఆగ‌స్ట్ 21 ఉద‌యం 11.30ని.ల‌కి విడుద‌ల చేస్తున్న‌ట్టు సైరా సినిమా యూనిట్ ప్రకటించింది

ఈ చిత్రంలో న‌య‌న‌తార‌, చిరంజీవి, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు , సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. వీరి పాత్ర‌లు ఎలా ఉంటాయ‌నే ఆస‌క్తి జ‌నాల‌లో ఉంది. మూవీని స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. చిత్రానికి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించ‌నున్నాడ‌ని టాక్‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.