ఆస్ట్రేలియా వేదికగా జరిగే పురుషుల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి, గురువారం రాత్రి ఈ జాబితాను రిలీజ్ చేసింది. అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తన తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌తో భారత తలపడనుంది.
సూపర్-12 దశలో గ్రూప్-2లో భారత్ తలపడనుంది. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో వరుసగా భారత్ మ్యాచ్‌లు ఉన్నాయి. దీనితో పాటే గ్రూప్-2లో రెండు క్వాలిఫయర్ జట్లతో ఆ తర్వాత మ్యాచ్‌లు ఆడనుంది టీమ్ఇండియా. ఈ ప్రపంచకప్‌లో అక్టోబరు 23న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. నవంబరు 9న తొలి సెమీఫైనల్ నిర్వహించనున్నారు. మెల్బోర్న్ వేదికగా నవంబరు 13న ఫైనల్ జరగనుంది.