టీ20 వరల్డ్​కప్ షెడ్యూల్​ విడుదల..తొలి మ్యాచ్​లో ఇండియా-పాకిస్తాన్ ఢీ

T20 World Cup schedule released .. India-Pakistan match in the first match

0
42

ఆస్ట్రేలియా వేదికగా జరిగే పురుషుల టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​ రిలీజైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి, గురువారం రాత్రి ఈ జాబితాను రిలీజ్ చేసింది. అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు మ్యాచ్​ల్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తన తొలి మ్యాచ్​లో దాయాది పాకిస్థాన్​తో భారత తలపడనుంది.

సూపర్​-12 దశలో గ్రూప్​-2లో భారత్ తలపడనుంది. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​లతో వరుసగా భారత్ మ్యాచ్​లు ఉన్నాయి. దీనితో పాటే గ్రూప్​-2లో రెండు క్వాలిఫయర్​ జట్లతో ఆ తర్వాత మ్యాచ్​లు ఆడనుంది టీమ్​ఇండియా. ఈ ప్రపంచకప్​లో అక్టోబరు 23న భారత్-పాకిస్థాన్ మ్యాచ్​ జరగనుంది. నవంబరు 9న తొలి సెమీఫైనల్​ నిర్వహించనున్నారు. మెల్​బోర్న్ వేదికగా నవంబరు 13న ఫైనల్ జరగనుంది.