టీ20 ప్రపంచకప్- విండీస్ విధ్వంసమా..ఇంగ్లాండ్ వీరవిహారమా?

0
98

టీ20 ప్రపంచకప్‌-2021లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న విండీస్‌…మళ్లీ తమ భీకర బ్యాటింగ్‌నే నమ్ముకుంది. సూపర్‌-12లో భాగంగా శనివారం ఇంగ్లండ్‌తో తమ తొలి మ్యాచ్‌లో తలపడుతోంది. టీ20ల్లో వెస్టిండీస్‌ ఎంత ప్రమాదకరమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలిచిన ఏకైక జట్టు అదే.

ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో విపరీతంగా మ్యాచ్‌లాడి ఈ ఫార్మాట్లో రాటుదేలిపోయారు విండీస్‌ వీరులు. లూయిస్‌, సిమన్స్‌, ఫ్లెచర్‌, పొలార్డ్‌, గేల్‌, రసెల్‌ లాంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ ఆ జట్టు సొంతం. ఆల్‌రౌండర్లకూ లోటు లేదు. లోతైన బ్యాటింగ్‌ విండీస్‌ మరో బలం. ఏ స్థితిలోనైనా ఫలితాలను మార్చేసే ఆటగాళ్లు కరీబియన్‌ జట్టులో ఉన్నారు. ప్రస్తుతం ఫామ్‌లో లేకపోయినా గేల్‌ ఎప్పుడైనా చెలరేగిపోగలడు.  అయితే రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలోనూ పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌ చేతుల్లో ఓడటం కొంత ఆందోళనపరిచే అంశం.

బట్లర్‌, రాయ్‌, మలన్‌, బెయిర్‌స్టో లాంటి విధ్వంసకారులు..మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్‌, సామ్‌ కరన్‌ లాంటి ఆల్‌రౌండర్లతో ఇంగ్లాండ్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. అవసరమైతే జోర్డాన్‌, వోక్స్‌, విల్లీ లాంటి బౌలర్లూ బ్యాటుతో సాయపడతారు. సమతూకంతో, ఎంతో ప్రమాదకరంగా కనిపిస్తున్న ఇంగ్లాండ్‌ ను అడ్డుకోవడం కష్టమే.

వెస్టిండీస్‌: సూపర్‌ 12, గ్రూప్‌ 1
కీరన్‌ పొలార్డ్‌, నికోలస్‌ పూరన్‌, డ్వేన్‌బ్రావో, రాస్టన్‌ చేజ్‌, ఆండ్రీ ఫ్లెచర్‌, క్రిస్‌ గేల్‌, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, ఇవిన్‌ లూయిస్‌, ఒబెడ్‌ మెకాయ్‌, లెండిల్‌ సిమన్స్‌, రవి రాంపాల్‌, ఆండ్రీ రసెల్‌​, ఒషేన్‌ థామస్‌, హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌, అకీల్‌ హుసేన్‌.
రిజర్వు ప్లేయర్లు: డారెన్‌ బ్రావో, షెల్డన్‌ కాట్రెల్‌, జేసన్‌ హోల్డర్‌.

ఇంగ్లాండ్- సూపర్‌ 12, గ్రూప్‌-1
ఇయాన్‌ మోర్గాన్‌, మొయిన్‌ అలీ, జొనాథన్‌ బెయిర్‌స్టో, సామ్‌ బిల్లింగ్స్‌, జోస్‌ బట్లర్‌, టామ్‌ కరన్‌, క్రిస్‌జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలన్‌, ఆదిల్‌ రషీద్‌, జేసన్‌రాయ్‌, డేవిడ్‌ విల్లే, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌వుడ్‌.
రిజర్వు ప్లేయర్లు: లియామ్‌ డాసన్‌, జేమ్స్‌ విన్స్‌, రీస్‌ టోప్లే.