ఆదర్శ్ బాలకృష్ణ పై తారక్ ఫ్యాన్స్ ఫైర్

ఆదర్శ్ బాలకృష్ణ పై తారక్ ఫ్యాన్స్ ఫైర్

0
103

ఆదర్శ్ బాలకృష్ణ పై జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడ్ని ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు. ఇంతకీ ఫ్యాన్స్ ఆగ్రహం వెనుక అసలు కారణం ఏంటి? ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’లో గెస్ట్ రోల్ చేస్తున్న ఆదర్శ్ బాలకృష్ణ, ఆదివారం షూట్‌కి అటెండయ్యాడు. ఈ సందర్భంగా త్రివిక్రమ్, ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఓ ఫొటోని ఫ్యాన్స్‌తో షేర్ చేశాడు. అందులో ఎన్టీఆర్, త్రివిక్రమ్ సార్‌తో కలిసి పనిచేయాలనే కల నెరవేరిందని రాసుకొచ్చాడు.

ఇంతవరకు బాగానేవుంది. ఎన్టీఆర్ పేరు పక్కన సార్ అన్న పదం వాడకపోగా, త్రివిక్రమ్ పేరు పక్కన సార్ అని వాడటం తారక్ అభిమానులకు కోపం తెప్పించింది. దీంతో ఎన్టీఆర్‌కి మర్యాద ఇవ్వాలంటూ అతడ్ని లక్ష్యంగా చేసుకుని సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.