కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. పెద్ద ఎత్తున ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు… ప్రయాణాలు పూర్తిగా ఆపేశారు, రవాణా స్ధంభించింది, దాదాపు 198 దేశాలకు ఈ వైరస్ పాకేసింది, దీంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కరోనా వైరస్ నియంత్రణ కోసం టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తనవంతు సాయంగా రూ.7.75 కోట్ల విరాళం ప్రకటించారు… ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. తన భార్య మిర్కా, తాను వ్యక్తిగతంగా ఈ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు.
ఇదిపెను సవాల్ గా మారింది అని మనం కచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటే దీనిని జయిస్తాము అని అన్నారు, స్విట్జర్లాండ్‌లోనూ కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. నిన్న రాత్రికి అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 86కు చేరుకుంది, ఇక్కడ దాదాపు 9000 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి, ఆయన చేసిన సాయం గురించి తెలిసిన అభిమానులు మనసున్న క్రీడాకారుడు అంటున్నారు.