కరోనా టీకా తీసుకున్నారా ఆ అరగంట చాలా కీలకం

That half hour of corona vaccination is crucial

0
107

దేశంలో కరోనా టీకా ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 18 ఏళ్లు నిండిన వారికి కూడా కరోనా టీకా ఉచితంగా అందిస్తోంది కేంద్రం. ఇక కోట్లాది మంది టీకాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టీకాపై ఇంకా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అంతేకాదు ఎన్నో అపోహలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కేంద్రం, నిపుణులు, వైద్యులు ఈ టీకా విషయంలో ఎన్నిసార్లు వాస్తవాలు చెబుతున్నా, సందేహాలు తీరుస్తున్నా కొందరు ఇంకా టీకా తీసుకోవడానికి జంకుతున్నారు.

ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించి అందరిలో యాంటీబాడీలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు కలుగుతాయి అని ఎంతో మంది అనుమాన పడుతున్నారు . దీనిపై ఎలాంటి అపోహాలు వద్దు, టీకా తీసుకున్న తర్వాత తొలి 30 నిమిషాలు చాలా కీలకం అని చెబుతున్నారు.

ఎవరైనా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తొలి 30 నిమిషాలలో ఏదైనా దుష్ప్రభావాలు ఆ తొలి 30 నిమిషాల్లోనే కనిపిస్తాయి. కేంద్ర ప్రభుత్వం అందుకే టీకా తీసుకున్న అరగంట పాటు వైద్యుల అబ్జర్వేషన్ లో ఉంచుతున్నాము అంటూ స్పష్టం చేసింది. దీనిపై ఎలాంటి అనుమానాలు వద్దు అని చెబుతున్నారు వైద్యులు.

అందరూ ఎలాంటి ఆందోళన లేకుండా కరోనా టీకా తీసుకోండి.