Steve Smith | మరోసారి ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్​గా ఆ స్టార్ ప్లేయర్

That star player once again became Australia's Test captain

0
118
steve smith

ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్​గా స్టీవ్ స్మిత్ మరోసారి ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల టిమ్ పైన్..సుదీర్ఘ ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా కొత్త కెప్టెన్​ను ఎంపిక చేసేందుకు ఆసీస్ క్రికెట్ బోర్డు ఆలోచనలు మొదలు పెట్టింది. ఈ బాధ్యతలు స్వీకరించేందుకు స్మిత్ కూడా రేసులో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.

ఓ మహిళతో అసభ్యకర చాటింగ్ చేశాడంటూ ఇటీవల టిమ్ పైన్ ​పై ఆరోపణలు వచ్చాయి. అవి నిజమేనంటూ ఒప్పుకొంటూ తన టెస్టు కెప్టెన్సీకి రాజీనామా ప్రకటించాడు పైన్. దీనితో ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్ ను వెతికే పనిలో పడింది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్​గా ఉన్నాడు పేసర్ ప్యాట్ కమిన్స్. దీంతో ఇతడికే సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇతడికి సహకరించేందుకు స్మిత్ ను వైస్ కెప్టెన్​గా ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి.