Yadadri: యాదాద్రిలో వైభవంగా పంచకుండాత్మక మహాయజ్ఞం

0
87

ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురుచూస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పునఃప్రారంభానికి అకురార్పణ జరిగింది. బాలాలయంలో పంచకుండాత్మక మహాయజ్ఞం ప్రారంభించారు. విశ్వశాంతి, లోక కల్యాణం కోసం యాగం నిర్వహిస్తున్నారు రుత్వికులు.  ఈనెల 28 వరకు ఇది కొనసాగనుంది.

యాదాద్రిలో నిత్య పూజలు, దర్శన వివరాలను ఈవో కార్యాలయం వెల్లడించింది. ఈ నెల 29వ తేదీ నుంచి అవి అమలు కానున్నట్లు ఈవో కార్యాలయం తెలిపింది. ప్రతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. అనంతరం స్వామి వారికి సుప్రభాత సేవ జరుగనుంది.