2022 టీ20 ప్రపంచకప్​ వేదికలు ఇవే..

0
107

2022 టీ20 ప్రపంచకప్​కు వేదికలు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీ మ్యాచ్​లను ఆస్ట్రేలియాలోని ఏడు ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. వీటిలో మెల్​బోర్న్​, సిడ్నీ, బ్రిస్బేన్​, పెర్త్​, అడిలైడ్, గీలాంగ్​, హోబర్ట్​​ ఉన్నాయి.

45 మ్యాచ్​లతో కూడిన ఈ మెగాటోర్నీ అక్టోబర్​ 16 నుంచి నవంబరు 13 వరకు జరగనుంది. నవంబరు 9, 10 తేదీల్లో జరగనున్న సెమీఫైనల్​ మ్యాచ్​లను సిడ్నీ, అడిలైడ్​ వేదికగా జరగుతాయి. ఫైనల్​ మ్యాచ్​ను​ మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో నిర్వహించనున్నారు.

ఈ మెగాటోర్నీ కోసం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​, అఫ్గానిస్థాన్, బంగ్లాందేశ్​, ఇంగ్లాండ్​, టీమ్​ఇండియా, పాకిస్థాన్​, దక్షిణాఫ్రికా జట్టు నేరుగా సూపర్​ 12 దశలోకి అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయింగ్​ మ్యాచ్​లు జరుగుతాయి.