భారత అథ్లెటిక్ లెజెండ్ మిల్కా సింగ్ కరోనాతో కోలుకుని తర్వాత కొద్ది రోజులకి మరణించారు, ఆయన భార్య కూడా గత వారం కన్నుమూసిన విషయం తెలిసిందే. క్రీడలలో భారతదేశానికి తొలి సూపర్ స్టార్లలో మిల్కా సింగ్ ఒకరు. పాకిస్దాన్ నుంచి వలస వచ్చారు, ఆ తర్వాత ఆయన భారత సైన్యంలో చేరారు.
ఆర్మీ తరుపునుంచే అథ్లెటిక్స్లో పోటీ చేసి, స్టార్ ప్లేయర్గా ఎదిగారు. నాలుగుసార్లు ఆసియా ఛాంపియన్ గా నిలిచారు ఆయన. అయితే ఆయనని అందరూ ఫ్లయింగ్ సిక్కు అంటారు, మరి అలా పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం.
1960 వ సంవత్సరం అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ లాహోర్లో జరిగిన ఇండో-పాక్ క్రీడా సమావేశానికి భారత అథ్లెట్లను ఆహ్వానించారు. మిల్కా సింగ్ పాకిస్తాన్కు వెళ్లడానికి ఇష్టపడలేదు. నెహ్రూ పట్టుబట్టడంతో భారత దళానికి నాయకుడిగా పాకిస్తాన్ వెళ్లారు.పాకిస్థాన్కు చెందిన అబ్దుల్ ఖలీక్పై మిల్కా సింగ్ తలపడాల్సి వచ్చింది. ఈ సమయంలో ఖలీక్ను సులభంగా ఓడించాడు మిల్కాసింగ్.అయూబ్ ఖాన్ మిల్కా సింగ్ ను ఫ్లయింగ్ సిక్కుగా పిలిచారు. దీంతో అక్కడ నుంచి ఆయన పేరు అలా ఉండిపోయింది.