తన బయోపిక్ పై నీరజ్ చోప్డా స్పందన ఇదే..

This is Neeraj Chopra's reaction to his biopic.

0
112

ఒలింపిక్ పతక వీరుడు, జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్డాపై బయోపిక్​ రానుందని కొన్నాళ్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని కొట్టిపారేశాడు నీరజ్. తనపై ఇప్పుడే బయోపిక్​ వద్దని అన్నాడు. తాను మరిన్ని పతకాలు సాధించాల్సి ఉందని, ఆ తర్వాతే బయోపిక్​ వస్తే హిట్టవుతుందని చెప్పాడు.

టోక్యో ఒలింపిక్స్ ట్రాక్​ అండ్​ ఫీల్డ్​ ఈవెంట్లలో పసిడి సాధించి 100 ఏళ్ల భారత్​ కలను నెరవేర్చాడు నీరజ్. నాటి నుంచి అతడిపై బయోపిక్ రానుందని ఊహాగానాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన నీరజ్​ తనకు క్రీడలే ముఖ్యమన్నాడు.

దీనిపై నీరజ్ స్పందిస్తూ..బయోపిక్​ల కోసం నన్ను సంప్రదించారు. అయితే నేను సాధించినదానికి ఇది ఆరంభం మాత్రమే. ఇది ఇంకా నా తొలి ఒలింపిక్స్​. నేను మరిన్ని పతకాలు సాధించాలి. సినిమా ఫ్లాప్​ అవ్వాలని నాకు లేదు. ఎక్కువ మెడల్స్​ సాధిస్తే..సినిమా కూడా హిట్​ అవుతుంది. ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం క్రీడలపైనే ఉందంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.