యాషెస్‌ టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే..

This is the Australian team for the Ashes Test series.

0
108

ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య వచ్చే నెలలో యాషెస్ టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా డిసెంబరు 8 నుంచి వచ్చే ఏడాది జనవరి 18 మధ్య కాలంలో మొత్తం ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఇందులో తొలి రెండు టెస్టులకు సంబంధించిన తుది జట్టును ఆస్ట్రేలియా జట్టు యాజయాన్యం బుధవారం వెల్లడించింది. టిమ్‌ పైన్‌ కెప్టెన్‌గా మొత్తం 15 మందితో కూడిన ఆటగాళ్ల వివరాలను ప్రకటించింది.

యాషెస్ సిరీస్‌కు ఆసీస్ జట్టిదే..

టిమ్‌ పైన్‌ (కెప్టెన్‌), పాట్‌ కమ్మిన్స్ (వైస్‌ కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్‌, మార్కస్‌ హ్యారిస్, జోష్‌ హేజిల్ వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, నాథన్ లైయన్‌, మైఖేల్‌ నేసర్‌, జై రిచర్డ్‌సన్, స్టీవ్‌ స్మిత్, మిచెల్ స్టార్క్‌, మిచెల్ స్వెప్సన్, డేవిడ్‌ వార్నర్.

వేదికలివే..

తొలి టెస్టు: డిసెంబరు 8-12 – గబ్బా, బ్రిస్బేన్‌

రెండో టెస్టు: డిసెంబరు 16-20 – ఆడిలైడ్‌ ఓవల్‌

మూడో టెస్టు: డిసెంబరు 26-30 – మెల్ బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌

నాలుగో టెస్టు: జనవరి 5-9 – సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌

ఐదో టెస్టు: జనవరి 14-18 – పెర్త్ స్టేడియం