Breaking: IPL 2022 పూర్తి షెడ్యూల్ ఇదే..తొలి మ్యాచ్ ఎవరి మధ్య అంటే?

0
34

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజ‌రాత్ తో పాటు ల‌క్నో రెండు ఫ్రొంచైజీలు ఆడ‌బోతున్నాయి.  మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి. ఒక్క బెంగళూరు తప్ప మిగతా అన్ని టీంలు కెప్టెన్ల పేర్లను ప్రకటించాయి. తాజాగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ రిలీజ్ అయింది. గత సీజన్​లో​ ఛాంపియన్స్​గా నిలిచిన చెన్నై సూపర్​ కింగ్స్​, రన్నరప్​గా ఉన్న కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఒక్కో జట్టు పద్నాలుగేసి మ్యాచ్‌లను ఆడాలి. దీంతో మొత్తం 70 లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇవే కాకుండా ఫైనల్‌తో కలిపి నాలుగు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉంటాయి.

ఐపీఎల్‌ జట్లను ఎప్పుడు లేని విధంగా రెండు గ్రూపులుగా బీసీసీఐ విభజించింది.

గ్రూప్ A:

ముంబై ఇండియన్స్ (MI)

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)

రాజస్థాన్ రాయల్స్ (RR)

ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

గ్రూప్ B:

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

పంజాబ్ కింగ్స్ (PBKS)

గుజరాత్ టైటాన్స్ (GT)