క్రికెట్ మ్యాచ్ లు ఆడే సమయంలో ఒక్కోసారి అంపైర్లు చెప్పే తీర్పులు మ్యాచ్ ఫేట్ మార్చేస్తాయి. అందుకే అనుమానాలు ఉంటే థర్డ్ అంపైర్ కు అపీల్ చేసుకుంటారు. ముఖ్యంగా నో బాల్స్, వైడ్స్ విషయంలో పిచ్ పై ఉండే అంపైర్లు డెసిషన్ చెబుతారు. కాని తాజాగా వెస్టిండీస్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్ సందర్భంగా అంపైర్ వ్యవహరించిన తీరుపై ప్రొటీస్ దిగ్గజాలు ఏబీ డివిల్లియర్స్, డేల్ స్టెయిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కొందరు క్రీడా కారులు క్రికెట్ అభిమానులు కూడా ఇదేమి అంపైరింగ్ బాబు అని కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో విండీస్ బౌలర్ మెకాయ్ వేసిన బంతి వైడ్ అని క్లియర్గా కనిపిస్తున్నా, అంపైర్ స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తోంది.
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 19 ఓవర్లో వెస్టిండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ ముల్దర్కు షార్ట్ బాల్ను సంధించాడు. దానిని షాట్ ఆడేందుకు ముల్దర్ విఫలయత్నం చేశాడు. అయితే స్పష్టంగా వీడియోలో చూడవచ్చు ఇది వైడ్ బాల్, కాని అంపైర్ ఇది పట్టించుకోలేదు. దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
Worst umpiring ever ??? pic.twitter.com/4fd9DwRy74
— ribas (@ribas30704098) July 4, 2021