నిన్ను బ్రోకర్ జీవన్ రెడ్డి అంటేనే అందరు గుర్తు పడతారు : అయోధ్య

0
228

పార్క్ హయత్ హోటల్ ఏమి దందా చేస్తున్నావో

రేవంత్ రెడ్డి కొట్లాడితే తప్ప పసుపు రైతుల గోస మీద సోయి లేదు

రేవంత్ రెడ్డి పేరు వింటే టీఆరెస్ నేతలకు నిద్ర లేనట్టుంది

ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి తీవ్ర విమర్శలు

ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అసలు పేరే బ్రోకర్ జీవన్ రెడ్డి అని, బ్రోకర్ జీవన్ రెడ్డి అంటేనే ఎవరైనా గుర్తు పడతారని టీపీసీసీ అధికార ప్రతినిధి, మీడియా కో ఆర్డినేటర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి విమర్శించారు. బుధవారం హైదరాబాద్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో జీవన్ రెడ్డికి ఉన్న విలాసవంతమైన సూట్ లో జరుగుతున్న వ్యవహారాలు అందరికీ తెలుసునని అన్నారు. సినిమా రంగముతో ఉన్న సంబంధాలు, వాటిని రాజకీయ అవసరాల కోసం వాడుతున్న సంగతి గురించి మీ టీఆరెస్ నాయకులు ఎవరిని అడిగినా చెప్తారని అయోధ్య రెడ్డి చెప్పారు.

దుబాయ్ లో దొంగ వ్యాపారం, బ్యాంకులకు రుణాలు ఎగవేత ఇలా ఎన్ని చెప్పినా జీవన్ రెడ్డి@పాండు గురించి ఇంకా తక్కువేనని విమర్శించారు. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూరులో నీ అవినీతి అక్రమాలపై పోరాడుతున్న తలారి సత్యం ఎలా దారుణంగా హతం అయ్యాడో ముందుగా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత జీవన్ రెడ్డి మీద ఉందన్నారు. ఆర్మూరులో పసుపు రైతులకు అన్యాయం జరిగిందని మొత్తుకున్నా నువ్వు పట్టించుకోకుండా పార్క్ హయత్ హోటల్ లో జల్సాలు చేసుకుంటున్న సమయంలోనే ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకునిగా రేవంత్ రెడ్డి ఆర్మూరులో పెద్ద ఎత్తున సభ పెట్టారని అయోధ్య రెడ్డి గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి కొట్లాడేదాకా సోయి లేని జీవన్ రెడ్డి సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్నాడా అని ప్రశ్నించారు. నీ మీద ఉన్న ఆరోపణలు, నీ బ్రోకర్ పనుల మీద అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీవీ స్టూడియో నుంచి పారిపోయి ఇప్పుడు నీతులు, సుద్దులు చెప్తుంటే మీ టీఆరెస్ నాయకులే నిన్ను చూసి నవ్వుతున్నారని అయోధ్య రెడ్డి ఎద్దేవా చేశారు.

తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నదని అన్నారు. కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల నుంచి విడిపించే నాయకులు రేవంత్ అని తెలంగాణ ఉద్యమకారులు కూడా విశ్వసిస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత హైదరాబాద్ కు పెద్ద ఎత్తున తరలి వస్తున్న అన్ని వర్గాలు ప్రజలు, వస్తున్న ఆదరణ చూస్తే టీఆరెస్ నాయకులకు నిద్ర వస్తున్నట్టు లేదని అయోధ్య రెడ్డి అన్నారు.