త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మరో సినిమా ?

త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మరో సినిమా ?

0
100

ప్రతి సినిమా మధ్య కాస్త ఎక్కువ విరామాన్ని తీసుకుంటారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్. అయితే ఇటీవలకాలంలో ఆయన వేగాన్ని పెంచారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో అరవింద సమేత చిత్రాన్ని చేస్తున్నారాయన. ఈ సినిమా తర్వాత నాని కథానాయకుడిగా కమర్షియల్ పంథాకు భిన్నంగా వినూత్న ఇతివృత్తంతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాల అనంతరం అల్లు అర్జున్‌తో ఓ భారీ చిత్రానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

వీరిద్దరి కలయిలో గతంలో జులాయి సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్‌కు యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ దృష్ట్యా ఈ సినిమాకు త్రివిక్రమ్ అద్భుతమైన కథను సిద్ధం చేశారని, దీనికి బన్నీ ఓకే చెప్పాడని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వినిపిస్తున్నది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం.