రాత్రి లైట్ ఆన్‌ చేసి పడుకుంటున్నారా? అయితే జాగ్రత్త..

0
120
Dreams in blue

మనలో చాలా మందికి రాత్రి సమయంలో లైట్స్‌ ఆన్ చేసి పడుకునే అలవాటు ఉంటుంది. మరికొందరికి లైట్ ఉంటే చస్తే నిద్ర పట్టదు. మరి లైట్ వేసుకుని పడుకునే అలవాటు ఉన్న వారికి పెద్ద సమస్యే పొంచివుందంటున్నారు నిపుణులు. తాజాగా  జరిగిన ఓ అధ్యయనంలో లైట్స్‌ వేసుకుని నిద్రపోయే వాళ్లకు ఊబకాయం, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని వెల్లడయింది.

టీవల జరిగిన ఓ అధ్యాయనంలో 552 మందిలో సగం కంటే తక్కువ మంది రోజుకు ఐదు గంటలు పూర్తి చీకటిని కలిగి ఉన్నారని అధ్యయన పరిశోధకులు తెలిపారు. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవారు లైట్స్ వేసుకుని నిద్రపోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.

వీరు చీకటిలో కంటే కాంతి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉండడడమే ప్రధాన కారణం.. మధుమేహం కారణంగా పాదాల తిమ్మిరి ఉన్నవారు పడిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి రాత్రిపూట కాంతిని ఉంచుకోవాలని చూసే అవకాశం ఉంది.