పెళ్లిపై స్పందించిన విజయ్​ దేవరకొండ..ఏమన్నారంటే?

Vijay Devarakonda responds to marriage..what?

0
73

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ.. తన సోదరుడు ఆనంద్​తో కలిసి ఓ స్పెషల్​ చిట్​చాట్​లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అన్నదమ్ములిద్దరూ తమ పెళ్లి గురించి మాట్లాడారు. ఇంకా తమకు సంబంధించిన పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

తనకంటే ముందు తన సోదరుడు ఆనంద్‌కే వివాహం జరుగుతుందని టాలీవుడ్‌ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆనంద్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్పకవిమానం’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్‌ అమాయకుడైన యువకుడి పాత్రలో నటించారు. దామోదర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్‌ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించారు.

స్కూల్‌లో చదువుకునే రోజుల్లో వేసవి కాలం సెలవులకు ఇంటికి వచ్చేవాళ్లం. రెండు నెలలు ఇంట్లోనే సరదాగా ఉండేవాళ్లం. ఆనంద్‌ మాత్రం నాకు చుక్కలు చూపించేవాడు. నన్ను బాగా విసిగించేవాడు” అని విజయ్‌ చెప్పగానే ఆనంద్‌ నవ్వులు పూయించారు.

అనంతరం విజయ్‌..”నాకంటే ముందు ఆనంద్‌కే పెళ్లి అవుతుంది” అనగానే.. “నో అన్నయ్యకే ముందు” అని ఆనంద్‌ సైగలు చేశారు. “అమ్మ ఫెవరెట్ ఎవరు” అనేదానికి సమాధానం చెబుతూ.. తానే అన్నట్లు ఇద్దరూ సమాధానం ఇచ్చుకున్నారు.