విశాఖలోని సాగర తీరానికి కొట్టుకు వచ్చిన భారీ తాబేలు – దీనికి ఎన్ని సంవత్సరాలో తెలుసా

విశాఖలోని సాగర తీరానికి కొట్టుకు వచ్చిన భారీ తాబేలు - దీనికి ఎన్ని సంవత్సరాలో తెలుసా

0
78

సముద్ర తీరానికి భారీ తాబేళ్లు అప్పుడప్పుడూ కొట్టుకొస్తూ ఉంటాయి. ఒక్కోసారి వాటిని అనారోగ్యం ఉండటం వల్ల కూడా సాగర తీరానికి చేరుకుంటాయి, అంతేకాదు సంతానం గుడ్లు పెట్టే సమయంలో కూడా ఇలా వస్తూ ఉంటాయి, అనేక చోట్ల సాగర తీరాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది..తాజాగా విశాఖలోని సాగర తీరానికి భారీ తాబేలు కళేబరం కొట్టుకుని వచ్చింది..

 

ఇలాంటి తాబేలు సాగర జలాల్లో లోతుగా ఉన్న ప్రదేశాల్లో సంచరిస్తుంటాయి. కాని కడుపుతో ఉంటే అవి తీరానికి వచ్చి ఒడ్డున ఉంటాయి, అయితే ఒక్కోసారి పడవలు తగిలి వలల వల్ల చనిపోతూ ఉంటాయి, అయితే తాజాగా దీనిని చూసేందుకు చాలా మంది వస్తున్నారు.

 

మత్య్సకారులు ఆ తాబేలును చూసి దాని వయసు వందేళ్లు పైగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది ఏ కారణంతో మరణించిందో తెలియదు కాని చనిపోయింది. అయితే ఇది సంతానం కోసమే వచ్చి ఉంటుందని భావిస్తున్నారు, మీరు ఈ పెద్ద తాబేలు చూడవచ్చు.