అంతర్జాతీయ క్రికెట్​కు వెస్టిండీస్ ఆల్​రౌండర్ గుడ్ బై

West Indies all-rounder goodbye to international cricket

0
88
DUBAI, UNITED ARAB EMIRATES - OCTOBER 26: Dwayne Bravo of West Indies in bowling action during the ICC Men's T20 World Cup match between South Africa and West Indies at Dubai International Stadium on October 26, 2021 in Dubai, United Arab Emirates. (Photo by Francois Nel/Getty Images)

వెస్టిండీస్ స్టార్​ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్​కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్​ టోర్నీ అనంతరం ఆట‌కు వీడ్కోలు ప‌ల‌క‌నున్న‌ట్లు ప్రకటించాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో విండీస్ ఓటమి అనంతరం ఈ ప్రకటన చేశాడు. వీడ్కోలుకు సమయం వచ్చేసిందని అత‌ను పేర్కొన్నాడు.

18 ఏళ్లుగా వెస్టిండీస్​ జట్టులో ఆడుతున్నాన‌నిఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాన‌ని చెప్పాడు. కానీ, కరీబియన్​ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తున్న‌ట్లు వివ‌రించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గి అంతర్జాతీయ స్థాయిలో వెస్టిండీస్​ పేరు నిలబెట్టుకున్నామని బ్రావో పేర్కొన్నాడు. రెండు ట్రోఫీలు డారెన్ సామి సార‌థ్యంలో పొందినట్లు గుర్తుచేసుకున్నాడు. గురువారం లంకతో మ్యాచ్​ అనంతరం ఫేస్​బుక్​ లైవ్​లో ఈ కామెంట్స్ చేశాడు బ్రావో.

కాగా, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్​లో సెమీస్​కు ఏమాత్రం ఛాన్స్ లేని శ్రీలంక టీమ్.. తన ఆఖరి గ్రూప్​ మ్యాచ్​లో స‌త్తా చాటింది. గురువారం జరిగిన మ్యాచ్​లో వెస్టిండీస్​పై 20 పరుగుల తేడాతో విజ‌యకేత‌నం ఎగ‌ర‌వేసింది. దీంతో విండీస్​ సెమీస్​ ఆశలు కూడా గ‌ల్లంత‌య్యాయి.