టెన్నిస్ తార సానియా మీర్జా మల్ల అదరగొట్టింది

0
137

ఆటతోనే కాదు అందంతోనూ అలరించిన టెన్నిస్ తార సానియా మీర్జా. అంతేకాదు వివాదాల్లోనూ ఆమెది అందె వేసిన చేయి. పాకిస్తాన్ క్రికెటర్ సోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకుని రెండు దేశాలకు మధ్య చర్చనీయాంశమైంది. పెళ్లైన తర్వాత ఆట మీద ఫోకస్ చేయకపోవడంతో ఆమె రాణించలేక చతికిలపడింది. నాలుగేళ్ల తర్వాత వింబుల్టన్ డబుల్స్ లో ఆమె తన సత్తా చాటింది.

తాాజాగా లండన్ లో జరిగిన వింబుల్టన్ 2021 చాంపియన్ షిప్ మ్యాచ్ లో సానియా అదరగొట్టింది. మహిళల డబుల్స్ లో సానియా మీర్జా, బెథానీ మాటెక్ జోడీ రెండో రౌండ్ లోకి ప్రవేశించింది. మొదటి రౌండ్ లో ఈ జోడీ 7-5, 6-3 తో ఆరో సీడ్ జంట దెసైరే క్రాజిక్, (అమెరికా), అలెక్సా గౌరాచి (చిలీ)లను ఓడగొట్టారు.

తొలుత కాసింత ఇబ్బందిపడ్డ సానియా, బెథానీ మాటెక్ జంట తర్వాత్ రెచ్చిపోయింది. ఆట చివర్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సానియా మీర్జా చాలా కాలం తర్వాత టెన్నిస్ లో రాణించడం పట్ల ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మరోవైపు పురుషుల డబుల్స్ లో బోపన్న – దివిష్ శరన్ జోడీ 0-7 (6-7), 4-6తో కొంటినెన్ (ఫిన్లాండ్) రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓటమిపాలై ఉసూరుమనిపించారు.