వరల్డ్ టీ20 జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ … ధోనీకి నో ఛాన్స్

వరల్డ్ టీ20 జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ ... ధోనీకి నో ఛాన్స్

0
114

భారత టీ2o జట్టు పగ్గాలు రోహిత్ శర్మ చేతికి అప్పగించాలని గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి.కొంత మంది మాజీ క్రికెటర్లు పరోక్షంగా ఈ విషయాన్ని తమ డ్రీమ్ టీ20 జట్టుకి రోహిత్ ని కెప్టెన్ గా ఎంపిక చేయడం ద్వారా వెల్లడిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ ప్రకటించిన వరల్డ్ టీ20 ఎలెవెన్ జట్టుకి భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి హెడ్ కోచ్ గా పని చేసిన టామ్ మూడీ ని క్రికెట్ కామెంట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ప్రస్తుత తరం క్రికెటర్లతో ఒక వరల్డ్ టీ 20 జట్టుని ప్రకటించమని కోరాడు. దాంతో…టీమ్ ని సెలక్ట్ చేసిన టామ్ మూడీ… రోహిత్ శర్మ ని ఓపెనర్ గా ఎంపిక చేయడంతో పాటు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించాడు. అయితే ధోనీకి ఈ జట్టులో చోటు దక్కలేదు.