విరాట్ కోహ్లీ పేరిట చెత్త రికార్డు..మూడో స్థానంలో ధోని

Worst record for Virat Kohli is Dhoni in third place

0
93

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యమైంది. భారత జట్టు మూడు మార్పులు చేయగా, న్యూజిలాండ్ ఒక మార్పు చేయాల్సి ఉంది. ఇషాంత్ శర్మ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజాలు గాయాలతో జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వారి స్థానంలో జయంత్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌, విరాట్ కోహ్లీ వచ్చారు.

తొలి టెస్టులో విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రెండో టెస్టులో జాయిన్ అయ్యాడు. ప్రాక్టీస్‌లోనూ అదరగొట్టిన కోహ్లీ అసలైన మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయాడు. వచ్చిన వెంటనే కేవలం 4 బంతులు ఆడి అజాజ్ బౌలింగ్‌లో డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే ఈ క్రమంలో టెస్టు కెప్టెన్లలో అత్యధికంగా డకౌట్ల లిస్టులో విరాట్ కోహ్లీ చేరాడు.

10 సార్లు ఇలా డకౌట్లు అయ్యి, రెండో స్థానానికి చేరాడు. ఈ లిస్టులో 13 సార్లు డకౌట్లతో స్టీఫెన్ ఫ్లెమింగ్ అగ్రస్థానంలో ఉండగా, 10 డకౌట్లతో గ్రేమ్ స్మిత్, విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచారు. 8 డకౌట్లతో అథర్టన్, క్రోంజే, ధోని మూడో స్థానంలో నిలిచారు.

అత్యధిక సార్లు డకౌట్లయిన టెస్ట్ కెస్టెన్లు..
13 స్టీఫెన్ ఫ్లెమింగ్
10 గ్రేమ్ స్మిత్
10 విరాట్ కోహ్లీ*
8 అథర్టన్/ క్రోంజే/ ధోని

భారత్‌కు చెందిన ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు ఇషాంత్ శర్మ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజాలు గాయాలతో జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వారి స్థానంలో జయంత్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌, విరాట్ కోహ్లీ వచ్చారు.