Women fell into drainage: అరెరే.. అలా ఎలా జరిగిందబ్బా!?

-

Women fell into drainage at signal point: కొన్ని వీడియోలు కడపుబ్బా నవ్విస్తాయి.. కొన్ని వీడియోలు అలా ఎలా జరిగింది అని ఆలోచించేలా చేస్తాయి. కడపుబ్బా నవ్విస్తూ, అలా ఎలా జరిగింది అన్న ఆలోచన రేకెత్తించే వీడియోలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ కోవలోకే చెందుతుందీ ఈ వీడియో. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోందీ వీడియో. అందులోని దృశ్యాల ప్రకారం ఓ జంక్షన్‌ వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడటంతో.. వాహనాలన్నీ నిలిపేస్తున్నారు. అదే రోడ్డులో ఓ స్కూటీపై ఓ మహిళ వచ్చింది. సిగ్నల్‌ వద్దకు బండిని స్లో చేసి.. స్కూటీని నిలిపింది.. కానీ కాలును నేల మీద పెట్టి బ్యాలెన్స్‌ చేసుకునేందుకు ప్రయత్నించింది.. కానీ పట్టు తప్పి బండి పక్కకు పడిపోయింది.. ఈ క్రమంలోనే ఆ మహిళ సైతం కిందపడి పల్లీ కొట్టి.. పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయింది. (Women fell into drainage) అంతా క్షణాల్లో జరిగిపోయేసరికి అక్కడే ఉన్న మిగిలిన వాహనదారులకు ఏమయ్యిందో అర్థం కాలేదు. ప్రస్తుతం ఈ వీడియోతో ట్రోలర్స్‌ ఒక ఆట ఆడుకుంటున్నారు. డాడ్‌ లిటిల్‌ ప్రిన్సెస్‌ ఏమో.. మెుదటి సారి బయటకు వచ్చినట్లు ఉందని కొందరు కామెంట్‌ చేస్తుంటే.. మరికొందరు మహిళలకు వాహనాలు ఇస్తే.. ఇలాగే జరుగుతుందని కుళ్లు జోకులు వేస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...