ఆ ఆటగాడు లేకుండానే వరల్డ్ కప్ కి టీం ఇండియా !

ఆ ఆటగాడు లేకుండానే వరల్డ్ కప్ కి టీం ఇండియా

0
74

ఇండియా క్రికెట్ కి బ్యాటింగ్ ప్రధాన బలమే అయినా బౌలింగ్ సహాయ సహకారాలు లేనిదే ఎ మ్యాచు గెలిచినట్లు చరిత్ర లేదు.. అందుకే బ్యాటింగ్ ఎంత ఇంపార్టెంటో బౌలింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్న విషయం క్రికెట్ చూసే వారికి తెలిసిన విషయం.. హేమాహేమీలు తమ సునామి లాంటి బంతులతో బాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టి తమ సత్త చాటుతున్నారు..అలాంటి టీం ఇండియా లో మాత్రం బౌలింగ్ కి ప్రత్యేక స్థానం ఉంది..

ముఖ్యంగా ఈ ఆటలో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ శైలి వేరు.. చెప్పాలంటే ఇండియన్ టీం లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ కి ప్రాముఖ్యత వచ్చింది జహీర్ ఖాన్ జట్టులో చేరినప్పటినుంచే అని చెప్పాలి. అయితే ఆ తర్వాత జహీర్ వారసుడు ఎవరనేది ఇంకా ప్రశ్నార్ధకంగా ఉంది.. 2015 నుంచి మేనేజ్మెంట్ ఒక చక్కని లైన్ అండ్ లెంగ్త్ కలిగిన లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్ కోసం చూస్తూనే ఉంది.. అందుకు చాల పరిక్షలు చేసింది కూడా.. మొదట్లో బరిందర్ శరన్ చాల బాగా అనిపించినా, ఎక్కువ రోజులు నిలవలేకపోయాడు.. ఆ తర్వాత జయదేవ్ ఉనడ్కట్, శ్రీనాథ్ అరవింద్ లు ఇలా వచ్చి అలా వెళ్లారు.. తాజాగా ఖలీల్ అహ్మద్ జహీర్ వారసుడిగా నిలుస్తాడనుకున్నా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు.. తన పేలవ ప్రదర్శనతో వరల్డ్ కప్ లో స్థానం కోల్పోయాడు.

ఆశిష్ నెహ్రా, ఇర్ఫాన్ పఠాన్ తమ తమ టైమ్స్ లో స్వింగ్ చూపించి జహీర్ ని మించిపోయే పరిస్థితి కి వచ్చారు.. కనీ ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ లేకపోవడం భారత జట్టును కలవరపరిచే విషయం.. ప్రపంచ కప్ కి లెఫ్ట్ ఆర్మ్ సీమర్ లేకుండానే టీం ఇండియా వెళ్తుంది.. భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ ఇద్దరు రైట్ ఆర్మ్ బౌలర్లు.. వీరు మంచి ఫామ్ లోనే ఉన్నారు ఇది భరత్ కి ఊరటనిచ్చే విషయం..