Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై సస్పెన్షన్ వేటు..!

-

ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న ను సస్పెండ్ చేస్తూ డిసిప్లినరీ కమిటీ ఛైర్మెన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీచేశారు. బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రతులను చింపి వేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు.. కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీసులు జారీచేసింది. 12 ఫిబ్రవరి వరకు సంజాయిషీ ఇచ్చుకోవాలి అందులో పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ కి మల్లన్న నుండి ఎలాంటి వివరణ అందలేదు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందున సస్పెండ్ చేస్తున్నట్లు చిన్నారెడ్డి(Chinna Reddy) తెలిపారు.

- Advertisement -

ఈ విషయంపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud). పార్టీ లైన్ లో ప్రతి ఒక్కరు ఉండాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణ ముందు కులం, మతం అనేది పనిచేయదు అని స్పష్టం చేసారు. చిన్న, పెద్ద అనే తారతమ్యం ఉండదు.. పార్టీ లైన్ దాటి.. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. రాహుల్ గాంధీ ఆశయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడితే తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) వ్యవహరించిన తీరుపై పార్టీ హై కమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు.

Read Also: మాజీ ఎంపీ గోరంట్లకు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్  
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi | 15 ఏళ్ళు పైబడిన వాహనాలకు నో ఫ్యూయల్..!

దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కాలుష్య కట్టడికి బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన...

Home Minister Anitha | మాజీ ఎంపీ గోరంట్లకు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్

మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ కు ఏపీ హోం మంత్రి అనిత(Home...