అదరగొట్టిన ఆర్యవీర్.. సెమీస్‌కు భారత్

-

Alltime Report, Desk: అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈకి భారత్ చుక్కలు చూపించింది. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag) .. యూఏఈ వర్సెస్ భారత్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. వరుస బౌండరీలతో స్కోర్‌ను పరుగు పెట్టించాడు. ఓపెనర్‌గా మైదానంలోకి వచ్చిన ఆర్యవీర్.. అతి తక్కువ సమయంలోనే యూఏఈ బౌలర్లకు సింహస్వప్నంగా మారాడు. 17ఫోర్లు, 7 సిక్సర్లతో 160 పరుగులు చేసి వన్ మ్యాన్ షో చూపించాడు. ఆర్యవీర్‌తో పాటు వీకే వినీత్ కూడా 65 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 309 పరుగులు చేసింది. ఆర్యవీర్, వినీత్ దూకుడుతో ఈ టోర్నీలో భారత్ అత్యధిక స్కోర్‌ను అందుకుంది.

- Advertisement -

ఆ తర్వాత 310 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టుకు భారత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల దెబ్బకు యూఈఏ కేవలం 239 పరుగులకే ఆలౌట్ అయింది. యూఏఈ బ్యాటర్లలో అహ్మద్ ఖుదాదాద్ 74 పరుగులతో, నూరుల్లా అయూబీ 39 పరుగులతో పోరాడారు. కానీ విజయం మాత్రం భారత్‌నే వరించింది. ఇక భారత బౌలర్ల విషయానికి వస్తే ఇషాన్ సూద్ 37 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్‌ స్పెల్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఘన విజయంతో భారత్‌ తన సెమీస్ బెర్త్‌ను కన్ఫమ్ చేసుకుంది. సెమీస్‌లో అఫ్ఘాన్‌తో తలపడటానికి సన్నద్ధం అవుతోంది.

Also Read : దోహాలో భారత్ దబడిదిబిడే.. ఒకే రోజు రెండు గోల్డ్ మెడల్స్

Follow Us on: X (Twitter)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ప్రపంచ చెస్ సమరం.. సిందరోవ్‌కే ఛాన్స్ అంటున్న అంచనాలు!

Alltimereport, Desk: భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ డి గుకేష్ (Gukesh) ప్రపంచ...

ఏపీలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌.. 720 పోస్టులు!

Alltime Report, Desk : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు స్వీట్...