ఏపీలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌.. 720 పోస్టులు!

-

Alltime Report, Desk : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు స్వీట్ న్యూస్ చెప్పింది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్–2 నోటిఫికేషన్‌(Group 2 Notification)ను విడుదల చేసింది. మొత్తం 720 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 11 రాత్రి 11.59 గంటల వరకు సమయం ఉంది. నోటిఫికేషన్‌ నంబర్‌ 37/2026 ప్రకారం 471 ఎగ్జిక్యూటివ్‌, 249 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులు 203 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. పోస్టులను బట్టి కనీస వయోపరిమితి 18 నుంచి 21 ఏళ్లు, గరిష్ఠ వయోపరిమితి 30 నుంచి 44 ఏళ్లుగా నిర్ణయించారు.

- Advertisement -

ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షను 2027 ఫిబ్రవరి 21న నిర్వహించనున్నారు. మెయిన్స్‌ తేదీని తర్వాత ప్రకటిస్తారు. దరఖాస్తు ప్రాసెసింగ్‌ ఫీజు రూ.250. పరీక్ష ఫీజు రూ.80. అర్హులైన కొన్ని వర్గాలకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఎంపికైన వారికి పోస్టులను బట్టి రూ.25,220 నుంచి రూ.1,30,580 వరకు వేతన శ్రేణి ఉంటుంది. అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ psc.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే చివరి తేదీ తర్వాత ఏడు రోజుల వరకు సవరణకు అవకాశం ఉంటుంది. ఒక్కో సవరణకు రూ.100 చెల్లించాలి.

Also Read : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Follow Us on: X (Twitter)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ప్రపంచ చెస్ సమరం.. సిందరోవ్‌కే ఛాన్స్ అంటున్న అంచనాలు!

Alltimereport, Desk: భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ డి గుకేష్ (Gukesh) ప్రపంచ...

అదరగొట్టిన ఆర్యవీర్.. సెమీస్‌కు భారత్

Alltime Report, Desk: అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈకి భారత్ చుక్కలు...