నాగ్‌పూర్ పేరును మార్చాలన్న సంజయ్ రౌత్

-

Alltimereport : ముంబైలోని దాదర్ మెట్రో స్టేషన్‌కు చైత్యభూమి పేరు పెట్టనున్న నేపథ్యంలో నాగ్‌పూర్ పేరును దీక్షాభూమి(Deekshabhoomi)గా మార్చాలని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకొస్తే మద్దతిస్తామని ప్రకటించారు. 1956 అక్టోబర్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నాగ్‌పూర్‌లో తన అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఆ ప్రాంతం దీక్షాభూమిగా ప్రసిద్ధి చెందింది. అంబేడ్కర్ జీవితంలో సామాజిక విప్లవం అక్కడి నుంచే మొదలైందని, నాగ్‌పూర్ పేరును దీక్షాభూమిగా మార్చడం ఆయనకు గొప్ప గౌరవమని రౌత్ పేర్కొన్నారు.

- Advertisement -

ఇటీవల దాదర్ మెట్రో స్టేషన్ పేరును చైత్యభూమిగా మార్చేందుకు అవసరమైన ప్రక్రియలు చేపడతామని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. అంబేడ్కర్ అంత్యక్రియలు జరిగిన ప్రాంతం చైత్యభూమి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రౌత్ (Sanjay Raut) డిమాండ్‌కు కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ మద్దతు తెలిపారు. నాగ్‌పూర్ పేరును దీక్షాభూమిగా మార్చడంలో అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అండగా ఉంటుందని వెల్లడించారు. అయితే, రౌత్ ముందుగా దాదర్ మెట్రో పేరు మార్పును స్వాగతించాలని బీజేపీ నేత నవనాథ్ బన్ విమర్శించారు. మరో మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులే నాగ్‌పూర్‌కు ఇప్పటికే దీక్షాభూమి గుర్తింపు ఉందని పేర్కొన్నారు.

Also Read : మైసా’లో రాములమ్మ గర్జన!

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం

Alltimereport : టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం రేగింది. కొత్తగా...

భారత్‌ను చూసి నేర్చుకోండి.. సెంట్రల్ బ్యాంక్‌కు ట్రంప్ క్లాస్

Alltimereport : అమెరికా సెంట్రల్ బ్యాంక్‌కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్...