భారత్‌ను చూసి నేర్చుకోండి.. సెంట్రల్ బ్యాంక్‌కు ట్రంప్ క్లాస్

-

Alltimereport : అమెరికా సెంట్రల్ బ్యాంక్‌కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్లాస్ తీసుకున్నారు. బ్యాంక్‌లోని వడ్డీ రేట్ల విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవి వడ్డీ రేట్లలా లేవంటూ చురకలంటించారు. ఇప్పటికయినా మేల్కొని వడ్డీరేట్లు తగ్గించాలని సూచించారు. అదే సమయంలో వడ్డీ రేట్ల విషయంలో భారత్ రిజర్వ్ బ్యాంక్‌ను చూసి నేర్చుకోవాలని అన్నారు. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో అమెరికా జీడీపీ 3.4 శాతంగా అంచనా వేశారు. మరోవైపు, అదే నెలలో ఆర్బీఐ (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చింది. అయినా, ఏప్రిల్-జూన్‌లో 7.8 శాతం వృద్ధితో భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వైట్ హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా ఫెడ్ రాజకీయ కోణంలో పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

తాను ఛైర్మన్‌ను కాకుండా, రాజకీయంగా మారిన ఫెడ్ వ్యవస్థనే తప్పుబడుతున్నానని చెప్పారు.ఆర్థిక గణాంకాలు బాగున్నప్పుడు క్రెడిట్ మెరుగుపడుతుందని, అప్పుడు వడ్డీ రేట్లు తగ్గించాలని ట్రంప్ (Donald Trump) అభిప్రాయపడ్డారు. కానీ ఫెడ్ అందుకు విరుద్ధంగా రేట్లు పెంచుతూ దేశాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. వడ్డీ రేట్లు తగ్గిస్తే అమెరికా జీడీపీ 4 శాతం నుంచి 15-20 శాతానికి చేరుతుందని, రుణాలు కూడా వేగంగా తీరిపోతాయని అన్నారు. భారత్‌లో తక్కువ వడ్డీ రేట్ల వల్లే 7 శాతం జీడీపీ వృద్ధి నమోదవుతోందని ట్రంప్ ప్రశంసించారు. ఇతర దేశాల ఆర్థిక విజయానికి అమెరికాయే కారణమని, కాబట్టి ప్రపంచంలోనే అత్యల్ప వడ్డీ రేట్లు అమెరికాలోనే ఉండాలని డిమాండ్ చేశారు.

Also Read : నాగ్‌పూర్ పేరును మార్చాలన్న సంజయ్ రౌత్

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం

Alltimereport : టాలీవుడ్ లో మరోసారి పైరసీ కలకలం రేగింది. కొత్తగా...

నాగ్‌పూర్ పేరును మార్చాలన్న సంజయ్ రౌత్

Alltimereport : ముంబైలోని దాదర్ మెట్రో స్టేషన్‌కు చైత్యభూమి పేరు పెట్టనున్న...