భారత్‌ ఎదుగుదలకు చైనా అడ్డంకులు.. అమెరికా హెచ్చరిక!

-

Alltimereport : భారత్‌ అభివృద్ధికి(India Growth) చైనా అడ్డంకులు సృష్టిస్తోందంటూ అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్‌తో కలిసి దేశానికి రెండు వైపులా ఒత్తిడి పెంచడానికి ప్రయత్నాలు చేస్తోందని అమెరికా కాంగ్రెస్ కమిటీ తన తాజా నివేదికలో పేర్కొంది. భారత్‌పై చైనా (China) వైఖరి ప్రమాదకరంగా మారుతోందని హెచ్చరించింది. కీలక పరిశ్రమలకు అవసరమైన సరఫరాలను నియంత్రించడం నుంచి పాక్‌కు సైనిక సహకారం అందించడం వరకు చైనా చర్యలు భారత్‌ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాల్లో భాగమని పేర్కొంది.

- Advertisement -

అమెరికా-చైనా ఆర్థిక, భద్రతా సమీక్షా కమిషన్‌ 2026 వార్షిక నివేదికలో భారత్‌ ప్రాధాన్యాన్ని ప్రస్తావించింది. చైనాతో పోటీ పడగల సామర్థ్యం ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటని పేర్కొంది. భారత్‌ బలపడితే (India Growth) ఆసియాలో శక్తుల సమతుల్యత మారుతుందని, చైనా సరఫరా వ్యవస్థలకు ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని తెలిపింది. అందుకే కీలక ముడి పదార్థాలు, సాంకేతికత, నైపుణ్యాలపై నియంత్రణతో భారత్‌ పారిశ్రామిక ఎదుగుదలను అడ్డుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని హెచ్చరించింది.

పాక్‌తో కలిసి రెండు వైపులా ముప్పు

పాకిస్థాన్‌(Pakistan)తో చైనా పెంచుకుంటున్న సైనిక సంబంధాలపైనా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) తర్వాత 2025 మేలో జరిగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ.. చైనా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకుండానే సంక్షోభ సమయంలో పాక్‌కు అండగా నిలిచిందని పేర్కొంది. చైనా సాంకేతిక సహకారం పాక్‌కు బలాన్నిస్తోందని, భారత్‌కు రెండు వైపులా ముప్పు పెరుగుతోందని తెలిపింది.

హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి పెరగడం భారత్‌ వ్యూహాత్మక ప్రయోజనాలకు సవాలుగా మారుతోందని నివేదిక పేర్కొంది. కీలక సముద్ర మార్గాలపై ప్రభావం చూపేందుకు, భారత్‌ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు చైనా ప్రయత్నిస్తోందని తెలిపింది. దక్షిణాసియా దేశాలకు మౌలిక వసతులు, ఆర్థిక భాగస్వామ్యాల కోసం భారీగా నిధులు అందిస్తూ ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకుంటోందని వివరించింది.

భారత్‌-అమెరికా సహకారం పెంచాలి

చైనా ఒత్తిడిని ఎదుర్కొనేందుకు భారత్‌, అమెరికా రక్షణ రంగంలో మరింత సమన్వయంతో పనిచేయాలని కమిటీ సూచించింది. హిందూ మహాసముద్రంలో ఉపరితల, అండర్‌వాటర్‌ నిఘా సమాచారాన్ని పంచుకోవాలని, చైనా నౌకలు, జలాంతర్గాముల కదలికలను సంయుక్తంగా పర్యవేక్షించాలని తెలిపింది. సైనిక విన్యాసాలకే పరిమితం కాకుండా నిరంతర కార్యాచరణ సహకారం పెంచుకోవాలని పేర్కొంది. ఇరు దేశాల రక్షణ, ప్రభుత్వ, వ్యాపార, విద్యా రంగాల యువ నాయకుల మధ్య సంబంధాలు పెంచేందుకు వ్యూహాత్మక నాయకత్వ మార్పిడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.

Also Read : ‘ప్రతి హిందువు ఇంట్లో లైసెన్స్‌డ్ తుపాకీ ఉండాల్సిందే’

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

కెనడాలో భారత జంట దారుణ హత్య..

Alltimereport : కెనడాలో భారత సంతతి జంట దారుణ హత్యకు (Indian-Origin...

‘అంతా మర్చిపోయాం.. మళ్ళీ బాధపెట్టొద్దు’

Alltimereport : ఆస్ట్రేలియా క్రికెట్‌ను మారోసారి శాండ్‌పేపర్ వివాదం (Sandpaper Controversy)...