అమెరికా 25శాతం టారిప్‌పై కేంద్రం రియాక్షన్ ఇదే!

-

Alltimereport : అమెరికా, భారత్ మధ్య మరోసారి టారిఫ్ చర్చలు మొదలయ్యాయి. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 25శాతం టారిప్ విధించాలని అగ్రరాజ్యం ప్రతిపాదించింది. దీన్ని పరిశీలిస్తున్నామని, అధిక ఉత్పత్తి ఆరోపణలను ఒప్పుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన భారీ పన్నులను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత మార్చిలో అమెరికా వాణిజ్య విభాగం ‘సెక్షన్ 301’ కింద కొత్త విచారణ మొదలుపెట్టింది. అవసరానికి మించి ఉత్పత్తి చేస్తూ ధరలు తగ్గిస్తున్నాయంటూ భారత్ సహా 16 దేశాలపై దర్యాప్తు చేసింది. ఈ తీర్పుతో ఫిబ్రవరిలో కుదిరిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం (India-US Trade Deal) కూడా మళ్లీ చర్చల దశకు వచ్చింది. ఈ విచారణ తర్వాత భారత్‌పై 25 శాతం వరకు పన్నులు ప్రతిపాదించింది అమెరికా.

- Advertisement -

చైనా సహా ఇతర దేశాలపై 20 నుంచి 35 శాతం, ఈయూ, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, స్విట్జర్లాండ్‌పై 15 శాతం, ఒప్పందం పూర్తయ్యాక వియత్నాంపై 20 శాతం పన్నులు వేయాలని ప్రతిపాదించింది. మార్కెట్లోకి రాకుండా భారత్ అడ్డుకుంటోందని, కార్మికులకు సరైన రక్షణ ఇవ్వడం లేదని అమెరికా ఆరోపించింది. ఫార్మా, స్టీల్, ఐసీటీ రంగాల్లో మిగులు ఉత్పత్తితో అమెరికా పరిశ్రమలను దెబ్బతీస్తున్నారని వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ పేర్కొన్నారు. బుధవారం వచ్చిన ఈ ప్రతిపాదనపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించింది.

25 శాతం టారిఫ్‌లను పరిశీలిస్తున్నామని, ఏ రంగంలోనూ అధిక ఉత్పత్తి సామర్థ్యం లేదని తేల్చి చెప్పింది. జనవరి 5 లోపు అభిప్రాయాలు పంపాలని, జనవరి 25న బహిరంగ విచారణ నిర్వహిస్తామని అమెరికా తెలిపింది. వాణిజ్య అభ్యంతరాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఒప్పందాన్ని (India-US Trade Deal) త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేస్తామని భారత్ స్పష్టం చేసింది.

Also Read : 149 ఏళ్లలో తొలిసారి.. సఫారీల సరికొత్త చరిత్ర!

Follow Us On: Whatsapp

Read more RELATED
Recommended to you

Latest news

Must read

149 ఏళ్లలో తొలిసారి.. సఫారీల సరికొత్త చరిత్ర!

Alltimereport : టెస్ట్ క్రికెట్ చరిత్రలో 149 ఏళ్ల తర్వాత మరో...

కైరో రహదారిపై మృత్యుజ్వాలలు.. 31 మంది సజీవ దహనం

Alltimereport : ఈజిప్ట్ (Egypt) రాజధాని కైరోలో ఘోర ప్రమాదం (Cairo...