Alltimereport : టీమిండియా కెప్టెన్లలో విరాట్ కోహ్లీ (Virat Kohli) చాలా ప్రత్యేకమట. అతని కోసం ప్రాణాలు పెట్టి మరీ ఆడేవారట ప్లేయర్స్. ఇది భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) తాజాగా చెప్పిన విషయం. టీమిండియాలో కెప్టెన్లు మారినా.. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని దూకుడు మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పాడు. అతడి కెప్టెన్సీలో ఆడిన ఆటగాళ్లు మైదానంలో సర్వశక్తులూ ఒడ్డేవారని యాదవ్ గుర్తుచేశాడు. వికెట్లు తీయడమే తన బాధ్యత అని కోహ్లీ స్పష్టంగా చెప్పేవాడని వెల్లడించాడు. ధోనీ, రోహిత్ వంటి కెప్టెన్లతోనూ ఆడిన కుల్దీప్.. కోహ్లీ నాయకత్వాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాడు. అతడి కెప్టెన్సీలో ఆటగాళ్లు ఎంతో దూకుడుగా, సానుకూలంగా ఉండేవారని తెలిపాడు.
జట్టు కోసం తమ శరీరాలను సైతం లెక్కచేయకుండా పోరాడేందుకు సిద్ధంగా ఉండేవారని పేర్కొన్నాడు. కోహ్లీ నుంచి క్రికెట్ మాత్రమే కాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకున్నానని కుల్దీప్ (Kuldeep Yadav) తెలిపాడు. ఆటకు బయట జీవితంలో సమతుల్యత పాటించడం, కష్టమైన పరిస్థితుల్లో ముందుకు సాగడం వంటి అంశాలపై కోహ్లీతో చర్చించేవాడినని చెప్పాడు. అతడితో మాట్లాడిన ప్రతిసారీ క్రికెట్‌కు మించిన విషయాలపై అవగాహన వచ్చేదని పేర్కొన్నాడు.
Also Read : ఒత్తిడిని తగ్గించడానికి 27 మార్గాలు
Follow Us On: Whatsapp


