ఈ టీడీపీ ఎమ్మెల్యే ఎంట్రీకి డోర్ క్లోజ్ చేసిన జగన్

ఈ టీడీపీ ఎమ్మెల్యే ఎంట్రీకి డోర్ క్లోజ్ చేసిన జగన్

0
112

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న డోర్లన్ని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లోజ్ చేశారు… పార్టీలో చేరాలనుకునే వారికి సవాలక్ష కండీషన్లు పెట్టారు… అయినా కూడా తాము పార్టీలో చేరుతామని అంటున్నారు ప్రధాన ప్రతిక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు…

వైసీపీలో ఎక్కడో ఒక మూలకు కాస్త స్థలం ఇస్తే అక్కడే ఉంటామని… అదే తమకు పదివేలని అంటున్నారు… ఇప్పటికే ఒకరు టీడీపీకి గడ్ బై చెప్పారు… ఇక మరోకరు ఆన్ దివేలో ఉన్నారు… త్వరలో మరోకరు కూడా వైసీపీలో చేరాలని చూస్తున్నారట…

ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారట…. ఇప్పటికే వైసీపీలో ఉన్న తన మిత్రులతో కూడా ఈ విషయంపై చర్చించారట… కానీ జగన్ మాత్రం ఆయన విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకున్నారట…