ఈ లాక్ డౌన్ తో ఎవరూ ఏ పని చేయడం లేదు.. ఉపాధి లేదు అందరూ ఖాళీగానే ఉంటున్నారు.. యావత్ ప్రంపంచం లాక్ డౌన్ లో ఉంది, ఇక చాలా మంది బయటకు రాకపోవడంతో రెస్టారెంట్లు హోటల్స్ కూడా పూర్తిగా క్లోజ్ లోనే ఉన్నాయి, ఇది వారిపై చాలా ప్రభావం చూపిస్తోంది.
ఇక అమెరికాలో అత్యంత దారుణంగా ఉంది పరిస్దితి. జార్జియాలోని స్మైరా అనే పట్టణంలో విట్లేస్ రెస్టారెంట్ నిర్వహిస్తున్న సల్యేర్స్ అనే మహిళ తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఓ పక్క కస్టమర్లు లేరు, అంతేకాదు రెస్టారెంట్ లోన్ కూడా బ్యాంకులకి చెల్లించాలి ఇది చాలా ఇబ్బందిగా ఉంది .
ఓ పక్క తమ ఉద్యోగులని కూడాకాపాడుకోవాలి, దీంతో ఆ రెస్టారెంట్ యజమానిక కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కి నెల రోజుల ముందు ఆమె ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన ఫోర్డ్ ముస్తాంగ్ జీటీ స్పోర్ట్స్ కారును అమ్మేసింది, వాటితో ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది. దాదాపు 10 లక్షల రూపాయలకు ఆ కారు అమ్మేసిందట,10 మంది ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించిందట.