కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో నేడు మూడో రోజు. న్యూజిలాండ్‌ను భారీ స్కోరు చేయనివ్వకుండా భారత జట్టు ప్రయత్నిస్తుంది. రెండో రోజు మ్యాచ్‌లో భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది న్యూజిలాండ్. లాథమ్, యంగ్ అర్ధసెంచరీలతో అదరగొట్టి 129 పరుగులు చేశారు.
మూడో రోజు మ్యాచ్‌లో భాగంగా ఓపెనర్ విల్ యంగ్‌ను పెవిలియన్‌కు పంపాడు టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్. కివీస్ సారథి కేన్ విలియమ్సన్‌ను ఔట్ చేశాడు ఉమేశ్ యాదవ్. దీంతో లంచ్ విరామానికి రెండు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది కివీస్.
మరోవైపు మూడో రోజు మ్యాచ్‌లో టీమ్ఇండియా వికెట్ కీపర్‌గా ఆడే అవకాశం దక్కించుకున్నాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకర్ భరత్. మెడనొప్పి కారణంగా సాహాకు విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ పేర్కొంది. దీంతో భరత్ మైదానంలో వచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 345 పరుగులు చేసింది.