నా అంతిమ లక్ష్యం ఇదే..షట్లర్​ కిదాంబి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

This is my ultimate goal..Shutler Kidambi Srikanth Interesting comments

0
118

ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో రజక పతకంతో మెరిసిన భారత స్టార్​ షట్లర్​ కిదాంబి శ్రీకాంత్​ తన అంతిమ లక్ష్యం ఏమిటో చెప్పాడు. ప్రస్తుతం ఛాంపియన్​షిప్​లో దక్కిన విజయాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు.

ఫైనల్​లో ఓడిపోవడం, టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించలేకపోవడం వంటి విషయాల గురించి కూడా మాట్లాడాడు. ఇంకా తన కెరీర్​ గురించి పలు విషయాలను చెప్పాడు.

ప్రతి టోర్నీకి మెరుగుపడుతూనే ఉన్నాను. జర్మన్​ ఓపెన్​, ఫ్రెంచ్​ ఓపెన్​ ఆడేటప్పుడు నా ఆటలో డిఫరెన్స్​ను గమనిస్తాను. ఇండోనేషియాలో ఆడేటప్పుడు మరింతగా గమనిస్తాను. ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో పాల్గొనేటప్పుడు మెడల్​ సాధించాలని ఉన్నప్పటికీ దాని​ గురించి ఆలోచించను. ఉత్తమంగా ఆడటంపైనే దృష్టి పెడతాను. బాగా ఆడితే తప్పకుండా పతకం సాధిస్తాం.

మన దేశం తరఫున ఆడేవాళ్లతో తలపడటం ఎప్పుడూ కష్టమైనదే. ఇద్దరం గెలవడానికే ఆడతాం. మ్యాచ్​లో నేను గెలవడం ఆనందంగా ఉంది. మ్యాచ్​ ముగిసిన తర్వాత మాములుగానే మాట్లాడుకున్నాం. టోర్నీ, పోటీ గురించి ఏమీ మాట్లాడుకోలేదు.