K.A.Paul about munugode bypoii: మునుగోడులో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయినా నేను గెలుస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. నల్లగొండలో మీడియాతో ఆయన మాట్లాడారు.. దేశంలోనే మోస్ట్ కమర్షియల్ బైపోల్ మునుగోడులో జరిగిందన్నారు. పోలీసులు తనను అడ్డుకునేందుకు ప్రయత్నించారని, సీఐ చంద్రశేఖర్రెడ్డి తనపై దాడి చేశారని ఆరోపించారు. అయితే.. పక్కనే ఉన్న ఎస్పీ పట్టించుకోకుండా ఎంకరేజ్ చేశారన్నారు. వారు తనను ఎన్కౌంటర్ చేయిస్తారేమోనని భయపడ్డానని కే.ఏ.పాల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికలో తనపై మూడు సార్లు దాడి జరిగిందన్నారు. ఉపఎన్నికలో యువత తనకే ఓటేశారని.. కనీసం 50వేల మెజార్టీతో గెలవడం పక్కా అని ధీమావ్యక్తం చేశారు.
- Advertisement -
Read also: మాకోసమైన శ్రీలంక గెలుస్తుంది