House owner died while in sex with housemade: అతడు 67 ఏళ్ల వృద్ధుడు.. 35 ఏళ్ల పని మనిషితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సంవత్సరాల తరబడిగా వారిద్దరి మధ్య ఈ వ్యవహారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆమెతో శృంగారం చేస్తుండగా, బెడ్‌పైనే గుండెపోటుతో మృతి చెందాడు. విషయం బయటకు తెలిస్తే, పరువు పోతుందనుకుందో, ఏమో.. తన భర్త కాళ్లపై పడి.. తప్పు ఒప్పుకొని, మృతదేహాన్ని మాయం చేయాలని బతిమిలాడింది. చేసిన తప్పు ఒప్పుకుందన్న కారణంతో, ఆ వృద్ధుడు మృతదేహాన్ని ఓ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో పడేసి వచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేస్తే.. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో జేపీ నగర్ పుట్టేనహళ్లి పోలీసులకు, ఓ నిర్జన ప్రదేశంలో వృద్ధుడు మృతదదేహం పడి ఉందని సమాచారం రావటంతో.. సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆ మృతదేహం 67 ఏళ్ల బలసుబ్రహ్మణ్యంగా పోలీసులు గుర్తించారు. అయితే, శరీరంపై ఎక్కడా గాయాలు లేకపోవటంతో హత్య కాదని పోలీసులు ఓ కొలిక్కి వచ్చారు. కానీ, ప్లాస్టిక్ సంచిలో కట్టి తీసుకువచ్చి పడేయటం పట్ల పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులను, అనుమానం ఉన్న వ్యక్తులను పోలీసులు విచారించారు. వారింట్లో పని చేసే, పని మనిషిని సైతం విచారంచటంతో.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పటంతో.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. మెుత్తం కథ అంతా బయటపెట్టింది.
తనకు, తన యజమాని అయిన బాలసుబ్రహ్మణ్యంకు గత కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు పనిమనిషి వెల్లడించింది. ఈ క్రమంలోనే, ఇద్దరూ శృంగారం చేస్తుండగా, తన యజమానికి గుండెపోటు వచ్చి, మంచంపైనే (House owner died) కుప్పకూలిపోయాడని తెలిపింది. అయితే, భయపడి, తన భర్త, సోదరుడికి చెప్పి.. వారి సాయంతో మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో కట్టి, నిర్మానుష్య ప్రదేశంలో పడేసినట్లు ఒప్పుకుంది. దీంతో పని మనిషి, ఆమెకు సహకరించిన ఆమె భర్త, సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.