కొత్త సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న గోపీచంద్

-

వరుస ప్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ సీనియర్ హీరో గోపీచంద్(GopiChand) మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. గోపీచంద్ హీరోగా నటించిన ‘రామబాణం’(Ramabanam movie) సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మూవీ టీమ్ సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తోంది. శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు భారీ రెస్పాన్స్ వస్తుండగా.. తాజాగా ‘దరువెయ్యరా’ అనే సెకండ్ సింగిల్‌ విడుదల చేశారు మేకర్స్.

- Advertisement -

కర్నూల్‌లో గ్రాండ్‌గా జరిగిన ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ మంత్రి టీజీ వెంకటేష్.. శ్రీవాస్ సినిమాలు చాలా హ్యాపీగా ఉంటాయని, గోపీచంద్ ఎనర్జిటిక్ లెవల్ వేరే లెవల్ అంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలాగే ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాల్లాగే ‘రామబాణం’(Ramabanam movie) కూడా విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకున్నట్లు చెప్పిన గోపిచంద్ ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలని కోరాడు. మిక్కీ జె మేయర్ అద్భుతమైన సంగీతం ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తుందన్న దర్శకనిర్మాతలు భక్తిరసంతో పండుగ వైబ్‌ని కలిగించే ఈ పాటలో నటీనటులంతా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారని, వారందరినీ కలసి చూడటం కన్నుల పండుగగా ఉందన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

Read Also: `బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న పవన్ కల్యాణ్ మాజీ భార్య (వీడియో)

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...